Header Banner

ఒంటిపూట బడుల టైమింగ్స్ లో కీలక మార్పులు! ఏపీ, తెలంగాణ విద్యా శాఖ ప్రకటన!

  Fri Mar 14, 2025 10:02        Education

ఏపీలో వేసవి తీవ్రత పెరుగుతోంది. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఒంటి పూట బడుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైమింగ్స్ వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట బడులు కొన సాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం ఒంటిపూట బడుల సమయాలు వేరుగా ఉన్నాయి.

ఒంటి పూట బడులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేసారు. దీంతో, వేసవి సెలవుల వరకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రోజురోజుకూ ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.


ఇది కూడా చదవండి: గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!


టైమింగ్స్ ఇలా
ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్నాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలు ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


వేసవి సెలవులతో
రంజాన్ మాసం కావటంతో ఉర్దూ పాఠశాలలకు ఇప్పటికే ఒంటి పూట బడులు అమల్లోకి వచ్చాయి. ఇక, ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగ న్నాయి. ఈ సారి ఎండ‌లు తీవ్రంగా ఉంటాయని వాతావర ణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అవస రమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యా శాఖ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ఖరారు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి జూన్ 12వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #summer #schools #halfdays #todaynews #flashnews #latestnews